జానారెడ్డి ఇక రిటైర్మెంట్‌ తీసుకోవాలి!

జానారెడ్డి ఇక రిటైర్మెంట్‌ తీసుకోవాలి!
x
Highlights

కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని...

కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని ఆయన సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్న అజ్ఞానైతే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చదువుకోని అజ్ఞాని అని విమర్శించారు. పీసీసీ చీఫ్‌ కుటుంబంలో ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారని, వీరిదంతా ఫ్యామిలీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమని... కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories