కేసీఆర్ కు డీఎస్ ఘాటు లేఖ

కేసీఆర్ కు డీఎస్ ఘాటు లేఖ
x
Highlights

టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌...పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే....పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో...

టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌...పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే....పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీని వదిలితే...కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని....దయచేసి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో పార్టీ చెప్పాలన్నారు డీ శ్రీనివాస్‌. తానెప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడానో చెప్పాలని డిమాండ్ చేశారు. మనసులో ఏదో పెట్టుకొని నిరాధారమైన ఆరోపణలు చేసి...రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లేని పోనివి కల్పించుకొని...సంజయ్‌పై కేసు పెట్టి కుటుంబాన్ని రోడ్డుకు ఇడ్చారని లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories