టీడీపీ అల్లకల్లోలం, బాబుకు భారీ దెబ్బ..

టీడీపీ అల్లకల్లోలం, బాబుకు భారీ దెబ్బ..
x
Highlights

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి బాగానే ఉన్నా తెలంగాణాలో మాత్రం రేపోమాపో పూర్తిస్థాయిలో నెలకొరిగేలా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్...

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి బాగానే ఉన్నా తెలంగాణాలో మాత్రం రేపోమాపో పూర్తిస్థాయిలో నెలకొరిగేలా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని టీడీపీకీ గుడ్ బై చెప్పగా ఇప్పుడు పార్టీకి చెందిన మరో ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వాళ్ళు రేపో మాపో పార్టీనుండి బయటకి వెళ్లే సూచనలు కనిపిస్తోన్నాయి. ఎందుకంటే మెన్న హైదరాబాదులో జరిగిన మహానాడు సమావేశానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు, బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమయింది. అసలే వీళ్ళు తమ పార్టీ ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదని అసంతృప్తితో ఉన్నారు. అందులోనూ చాలా సందర్భాలలో పరోక్షంగా విమర్శలు చేశారు కూడా. అలాంటిది వీరిద్దరు మహానాడుకి హాజరవకపోవడం, వీరు కొద్దిరోజుల్లోనే పార్టీ ఫిరాయించబోతున్నారు అనే అంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఏదిఏమయినా వీరు ఇద్దరు పార్టీ మారితే మాత్రం తెలంగాణలో టీడీపీ దాదాపు మునిగిపోయినట్లే. మరి బాబు వీరిని పార్టీ మారకుండా ఎలా బుజ్జగిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.

Show Full Article
Print Article
Next Story
More Stories