తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా!

తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా!
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి . చంద్రబాబు తన పాలనతో ఏపీని అవినీతి ప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు....

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి . చంద్రబాబు తన పాలనతో ఏపీని అవినీతి ప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని మోసం చేసిన చంద్రబాబు‌... టీడీపీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలని... లేదంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్దిచెబుతారని ధ్వజమెత్తారు. ప్రజాభీష్టం మేరకు వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచే పోటీ చేస్తానన్న ఆయన చంద్రబాబు ఓడిపోవాలని మోకాళ్ల నొప్పులు ఉన్నా సరే తిరుమల మెట్లు ఎక్కి మరీ మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories