ద్రవిడ నిధి మన దక్షిణామూర్తి

ద్రవిడ నిధి మన దక్షిణామూర్తి
x
Highlights

ద్రవిడ యోధుడు మన దక్షిణామూర్తి, ఇకలేడు,తిరిగిరాని లోకాలకి ఎగినాడు, తెలుగు బిడ్డ, తమిళ మహా నాయకుడు , పేదల అండ దండ అంతిమ శ్వాస వదిలాడు. శ్రీ.కో ...

ద్రవిడ యోధుడు మన దక్షిణామూర్తి,

ఇకలేడు,తిరిగిరాని లోకాలకి ఎగినాడు,

తెలుగు బిడ్డ, తమిళ మహా నాయకుడు ,

పేదల అండ దండ అంతిమ శ్వాస వదిలాడు. శ్రీ.కో

తమిళనాడు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసిన మహా నాయకుడు, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇక లేరు. నిన్న సాయంత్రం 6.10 నిముషాలకు ఆయన మరణీంచినట్లుగా కావేరి ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అనేక పోరాటాలలో ఆరితేరిన యోధుడు కరుణానిధి జీవిత విశేషాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఆయన అచ్చ తెలుగు బిడ్డ అంటే నమ్మడానికి ఎలాగున్నా అది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం.
మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువలైలో 1924 జూన్ 3న కరుణానిధి పుట్టారు. ఆయన తల్లితండ్రులు తెలుగు వారు. ఆయన మాత్రు భాష తెలుగు. ముత్తువేలు, అంజు దంపతుల ముద్దు బిడ్డ అయిన కరుణానిధికి అమ్మానాన్నలు పెట్టిన పేరు దక్షిణామూర్తి. . చిన్నతనం నుంచే అనేక సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు కరుణానిధి 1969లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చివరిగా 2006 మే 13న ఐదవమారు సీఎం గా తమిళ పీఠం ఎక్కారు. భారత దేశ రాజకీయాలలో ఆయన ప్రభావం గొప్పది.

Show Full Article
Print Article
Next Story
More Stories