నల్లధనంపై మోడీ మాట నీటి మూటేనా...స్విస్ బ్యాంకులోకి మళ్లీ చేరిన బ్లాక్ మనీ

నల్లధనంపై మోడీ మాట నీటి మూటేనా...స్విస్ బ్యాంకులోకి మళ్లీ చేరిన బ్లాక్ మనీ
x
Highlights

విదేశాలకు నల్ల డబ్బు భారీగా తరలిపోతోందా ? స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరిగాయా ? నల్లధనం నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని...

విదేశాలకు నల్ల డబ్బు భారీగా తరలిపోతోందా ? స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరిగాయా ? నల్లధనం నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని కేంద్రం చెబుతుంటే గతేడాది భారతీయుల డిపాజిట్లు ఎలా పెరిగాయ్. బ్లాక్‌ మనీని అరికట్టడంలో కేంద్రం మాటలు వట్టివేనని తేలిపోయిందా ?

స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న మొత్తాన్ని ఇండియాకు రప్పిస్తాం ఒక్కొక్కరి అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం ఇది 2014 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. అంతేకాదు నల్లధనం నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని తీసుకురావడం అటుంచితే ఇక్కడి నుంచి తరలిపోతున్న డబ్బును కూడా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది.

డిపాజిట్లపై స్విస్‌ బ్యాంకు నివేదికను విడుదల చేసింది. నివేదికల్లో 50 శాతం భారతీయుల డిపాజిట్లు పెరిగినట్లు పేర్కొంది. అది కూడా 2017 సంవత్సరంలోనే డిపాజిట్లు ఊహించని స్థాయిలో పెరిగాయని స్విస్‌ బ్యాంక్ నివేదికలో తేలింది. 7 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని భారతీయులు డిపాజిట్ చేసినట్లు సమాచారం. 2016లో 6వేల 891 కోట్ల రూపాయలు జమ చేశారు.

స్విస్ బ్యాంకులు సురక్షితమని భావించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు స్విస్‌ బ్యాంక్‌లో డిపాజిట్లు చేస్తుంటారు. ఖాతాదారులకు సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచడంలో స్విస్‌ బ్యాంక్ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని 100 దేశాలకు చెందిన ప్రముఖులు డిపాజిట్‌ చేసిన నల్లధనం వంద లక్షల కోట్లుగా స్విస్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. 2016, 17 సంవత్సారాల్లోనే భారతీయులు దాదాపు 14 వేల కోట్ల రూపాయలు స్విస్‌ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. స్విస్ బ్యాంకు భారతీయుల డిపాజిట్లను వెల్లడించడంతో బ్లాక్‌ మనీని అరికట్టడంలో కేంద్రం మాటలు వట్టివేనని తేలిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories