రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

nanireddy
Updated on: 24 Dec 2018 4:24 PM IST
రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
X

పాకిస్థాన్ ఆల్ రౌండర్, స్టార్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ తరువాత తాను టెస్ట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇదేక్రమంలో వన్డే, టీ-20ల్లో కొనసాగే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 2003లో పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆరంగేట్రం చేసిన ఈ 38 ఏళ్ల స్టార్ ఆటగాడు. తన కెరీర్‌లో మొత్తం 54 టెస్టులు ఆడి 3,644 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతకుందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జూలు విదిల్చాడు. మొత్తం 209 టెస్టులు ఆడిన హఫీజ్ 26 శతకాలు, 56 అర్ధశతకాలతో 12,161 పరుగులు చేశాడు. కాగా హఫీజ్ రిటైర్మెంట్ పై మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు తమ స్పందన తెలియజేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story