నేను ఎమ్మెల్యే అయ్యాక ఎన్ని హత్యలు చేశానో చెప్పాలి..

నేను ఎమ్మెల్యే అయ్యాక ఎన్ని హత్యలు చేశానో చెప్పాలి..
x
Highlights

కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విరుచుకుపడ్డాడు. దళితుడైన తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాస్‌...

కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విరుచుకుపడ్డాడు. దళితుడైన తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాస్‌ హత్యను కోమటిరెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అయ్యాక ఎన్ని హత్యలు చేశానో రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి ఎందుకు టార్గెట్‌ చేశాడో అర్ధంగావడం లేదన్నారు. హత్యా రాజకీయాలను మొదలుపెట్టిందే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు. శవాలమీద పేలాలు ఏరుకునేలా రాజకీయం చేస్తున్నారని, నయీంను పెంచి పోషించింది కోమటిరెడ్డి బ్రదర్సే అన్నారు. మేం నయీం బాధితులమని, నయీం మనుషులకు రాజగోపాల్‌రెడ్డి టికెట్స్‌ ఇప్పించారని వీరేశం ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories