నిప్పులపై నడిచిన ఎమ్మెల్యే.. చిన్నారులు నిప్పుల్లో నడవడంపై విమర్శలు

x
Highlights

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి వేడుకలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిప్పులపై నడిచారు. ఇతర భక్తులతో పాటు పిల్లలు కూడా నిప్పులపై నడిచారు. అయితే,...

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి వేడుకలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిప్పులపై నడిచారు. ఇతర భక్తులతో పాటు పిల్లలు కూడా నిప్పులపై నడిచారు. అయితే, నిప్పులపై పిల్లలు నడవడం కలకలం రేగింది. మహబూబాబాద్ లో అయ్యప్ప స్వాముల సంకీర్తనతో వీధులు మారుమ్రోగాయి. అయ్యప్ప స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వామివారి రథాన్నిలాగి ఊరేగింపును ప్రారంభించారు. మిగతా స్వాములతో కలిసి ఆయన ఊరేగింపులో పాల్గొన్నారు. ఉత్సవ వేడుక చివర్లో అయ్యప్పస్వామికి ప్రధాన అర్చకుడు ప్రత్యేక పూజ చేశారు. ఒంటిపై ఇ‌ష్టానుసారం నిప్పులు చల్లుకున్నారు. తర్వాత నిప్పులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ నడిచారు. ఇతర భక్తులతో ఓ బాలుడు, పాప నిప్పులపై నడిచారు. తర్వాత నిప్పులు చుట్టూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ పాటలు పాడారు. అయితే, ప్రమాదవశాత్తు పిల్లలు నిప్పులు పడి తీవ్ర గాయాలు లేదా చనిపోతే ఎవరీ బాధ్యత అనేది అంతుబట్టని విధంగా ఉంది. భక్తి పారవశ్యంలో పెద్దలు నిప్పుల్లో నడిస్తే తప్పులేదు. కానీ పిల్లలను నడిపించడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories