కొడుకు కోసం చంద్రబాబు క్షుద్రపూజలు
Highlights
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన తప్పుకు మహిళా...
arun3 Jan 2018 8:54 AM GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన తప్పుకు మహిళా అధికారిని బలి చేశారని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రోజా మాట్లాడుతూ, కొడుకు లోకేష్ కోసమే చంద్రబాబు క్షుద్ర పూజలు చేయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న స్వార్థంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆ నెపాన్ని మహిళా అధికారి అనురాధపై నెట్టారని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలపై పీఠాధిపతులు చంద్రబాబును నిలదీయాలని ఎమ్మెల్యే రోజా అన్నారు.
లైవ్ టీవి
నమ్మించి మోసం చేశాడు.. 45 లక్షలు కాజేసాడు
13 Dec 2019 1:15 PM GMTఏపీ రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ
13 Dec 2019 12:42 PM GMTనాన్న మీరుంటే బాగుండు .. వెంకీ ఎమోషనల్ పోస్ట్
13 Dec 2019 12:39 PM GMTఇటు దిశ బిల్లు ఆమోదం.. అటు గుంటూరులో మైనర్పై అఘాయిత్యం !
13 Dec 2019 12:11 PM GMTబంపర్ ఆఫర్ కొట్టేసిన దొరసాని
13 Dec 2019 12:03 PM GMT