ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ ఇంట విషాదం...

ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ ఇంట విషాదం...
x
Highlights

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలీల్‌ఖాన్‌ సోదరుడు షబ్బీర్‌ అహ్మద్‌ ఖాన్‌ కుమారుడు మోసిన్‌ఖాన్‌ (27) గుండె...

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలీల్‌ఖాన్‌ సోదరుడు షబ్బీర్‌ అహ్మద్‌ ఖాన్‌ కుమారుడు మోసిన్‌ఖాన్‌ (27) గుండె పోటుతో గురువారం మరణించాడు. మోసిన్‌ఖాన్‌ ఆటోనగర్‌లో ఐరన్‌ వ్యాపారం చేస్తున్నాడు. గురువారం ఉదయం వ్యాపారం నిమిత్తం ఆటోనగర్‌ వెళ్లాడు. అయితే గుండెలోనొప్పిగా ఉందని ఒక్కడే సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లి, తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం తెలియజేశాడు. గుండెపోటు అధికంగా రావడంతో చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, కుటుంబ సభ్యులు ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోసిన్‌ఖాన్ మృతి చెందడం ప‌ట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా జలీల్‌ఖాన్ సోదరుడు షబ్బీర్ అహ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న‌గ‌రంలోని ప‌లువురు ప్ర‌ముఖులు మోసిన్‌ఖాన్ భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories