ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సమాచారం కోసం టెన్షన్.. మొత్తానికి..

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సమాచారం కోసం టెన్షన్.. మొత్తానికి..
x
Highlights

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటనకు వెళ్లిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి 8 గంటల పాటు వెనుదిరిగి రాకపోవడంతో పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు,...

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటనకు వెళ్లిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి 8 గంటల పాటు వెనుదిరిగి రాకపోవడంతో పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్‌ నెలకొంది. మధ్యాహ్నం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే ఆచూకీ రాత్రయినా తెలియక పోవడంతో ఏం జరిగిందోనని నానా హైరానా పడ్డారు. గిడ్డి ఈశ్వరి గురువారం దళితతేజంలో పాల్గొనడానికి గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్‌కు వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిశాక మండలకేంద్రం నుంచి సప్పర్ల, ధారకొండ, దుప్పిలవాడ పంచాయతీల్లో పర్యటించడానికి బయల్దేరారు. పోలీసులు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో వద్దన్నారు. అయితే ఆమె వినలేదు. గాలికొండకు బయల్దేరారు. చీకటి పడినా ఎమ్మెల్యే నుంచి సమాచారం రాలేదు. చివరికి రాత్రి పదిగంటలకు ధారకొండకు ఎమ్మెల్యే చేరుకున్నారన్న సమాచారంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో 8 గంటలపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది.


Show Full Article
Print Article
Next Story
More Stories