తీరు మార్చుకోకపోతే తాట తీస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్

తీరు మార్చుకోకపోతే తాట తీస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్
x
Highlights

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిలమత్తూరు మండలంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇప్పటి...

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిలమత్తూరు మండలంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇక నుంచి నాయకులందరూ ఒకే మాటపై ఉండాలన్నారు. తీరు మార్చుకోని నాయకుల తాట తీస్తానని హెచ్చరిచారు.

గురువారం బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. నేతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల గురించి నేతలు బాలయ్యకు వివరించారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నా తమకు సరైన గుర్తింపు లభించడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను సర్పంచులు, ఎంపీటీసీలే పంచుకుంటున్నారని... కార్యకర్తల మంచిచెడ్డలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఇకపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిపోయినదాన్ని నేతలు, కార్యకర్తలు మరచిపోవాలని... ఇకపై అందరూ కలసి పనిచేయాలని సూచించారు. లేకపోతే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా పని చేయాలని... లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories