సంగీతకు ఊరట..

సంగీతకు ఊరట..
x
Highlights

హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తున్న సంగీత కేసును మియపూర్ ఫ్యామిలీ కోర్టు విచారించింది. కేసు విచారణకు సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి, అతడి తల్లిదండ్రులు...

హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తున్న సంగీత కేసును మియపూర్ ఫ్యామిలీ కోర్టు విచారించింది. కేసు విచారణకు సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి, అతడి తల్లిదండ్రులు హాజరయ్యారు. సంగీతకు నెలకు ఇరవై వేల రూపాయలు చెల్లించడంతో పాటు ఇంట్లో అనుమతించాలని అత్తింటివారికి మియపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంగీతకు మెయింటెనెన్స్‌ ఖర్చులు నెలకు రూ.20 వేలు చెల్లించాలని, అలాగే, ఆమెను గౌరవ ప్రదంగా ఇంట్లోకి భర్త తీసుకెళ్లాలని ఆదేశించింది. అయితే, దీనిపై భర్త శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కౌంటర్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. భార్యను బాగానే చూసుకుంటానని, ఆమె తన వద్దే ఉంటుందని అలాంటప్పుడు మెయింటెన్స్‌ ఖర్చులు ఎందుకు ఇవ్వడం అని ఆ కౌంటర్‌లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. భర్త, అత్తమామలు కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నారంటూ సంగీత కేసు పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మూడు కేసులు ఆమె పెట్టారు. ఈ కేసుకు సంబంధించి భర్త, అత్తమామలు కోర్టుకు హాజరుకాగా సంగీత తరుపున ఆమె సోదరుడు కోర్టుకు హాజరయ్యాడు. సంగీత మాత్రం ఇంకా దీక్షలోనే ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories