మంత్రి కేటీఆర్‌ సహాయానికి అభినందల వెల్లువ

మంత్రి కేటీఆర్‌ సహాయానికి అభినందల వెల్లువ
x
Highlights

ఆ చిన్నారికి పట్టుమని పదినెలలు కూడా నిండలేదు. ఇంతలోనే కంటికి కొండంత కష్టం. అండగా ఉంటుందనుకున్న ఆరోగ్య శ్రీ ఆదుకోలేదు. అనుకోకుండా తారసపడిన భరత్‌ అనే...

ఆ చిన్నారికి పట్టుమని పదినెలలు కూడా నిండలేదు. ఇంతలోనే కంటికి కొండంత కష్టం. అండగా ఉంటుందనుకున్న ఆరోగ్య శ్రీ ఆదుకోలేదు. అనుకోకుండా తారసపడిన భరత్‌ అనే వ్యక్తి... ఆలోచన ఆ చిన్నారికి వచ్చిన కష్టాన్ని గట్టెక్కించింది. కార్పోరేట్‌ హాస్పిటల్‌లో కాసులు చెల్లించలేని ఆ నిరుపేద తల్లిదండ్రులకు మంత్రి కేటీఆర్‌ ఆపద్భందువయ్యాడు. ఏంటా చిన్నారి కథ..? ఎవరా భరత్‌..? మంత్రి చేసిన సహాయం ఏంటి..?

ఎక్కడో మారుమూల గ్రామం. ఒకే కాన్పులో పుట్టిన ముగ్గురిలో పది నెలల చిన్నారి శ్రీలక్ష్మీ కూడా ఉంది. అయితే తనతో పాటు పుట్టిన మరో ఇద్దరు వేర్వేరు కారణాలతో రెండు నెలల వ్యవధిలోపే చనిపోయారు. మిగిలిన చిన్నారి మాత్రం ఆడుతూ పాడుతూ అల్లారుముద్దుగా పెరుగుతుంది. కానీ అనుకోకుండా చిన్నారి శ్రీలక్ష్మీకి కంటి సమస్య వచ్చింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు లేటుగా గుర్తించారు.

వెంటనే పాప కళ్లు బాగు చేయించాలని చిన్నారి తల్లిదండ్రులు చాలా ఆసుపత్రులు తిరిగారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన పాప కోసం ఆరోగ్య శ్రీ కార్డు పట్టు కొని తెలిసిన ప్రతి కంటి ఆసుపత్రికి వెళ్లారు. చివరకు మంచి వైద్యం దొరుకుతుంది కదా అని హైదరాబాద్ కు వచ్చారు. కానీ ఇక్కడ ఏపీకి చెందిన ఆరోగ్యశ్రీ కార్డు పనిచెయ్యదని తెలిసి మదనపడిపోయారు ఆ తల్లిదండ్రులు. అలాగని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించే స్తోమత లేదు.

ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పాప బంధువులకు భరత్ అనే వ్యక్తి తారసపడ్డాడు. ముద్దు ముద్దుగా ఆడుకుంటున్న పాపకు ముద్దులు పెట్టాడు. ఆ వెంటనే కంటి సమస్య ఉందని తెలిసి చలించి పోయాడు భరత్. ఎలా అయినా ఈ పాపకు చికిత్స చేయించాలని కంకణం కట్టుకున్నాడు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి చిన్నారి సమస్యను తీసుకెళ్లాడు. భరత్ తన ట్విట్ లో అన్నయ్య. చిన్న పాపకి కంటి సమస్య. L.V.ప్రసాద్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేయాలి. మీరు ఒక లెటర్ ఇస్తే ఫ్రీగా పని అవుతుంది అన్నయ్య. వీళ్లది AP. ఆరోగ్యశ్రీ పని చేయటం లేదు. ప్లీజ్ హెల్ప్ అన్నయ్య అంటూ చిన్నారి ఫొటోతో ట్విట్ చేశారు.

ట్విట్టర్‌ ను చూసిన వెంటనే మంత్రి కేటీఆర్ ఆ ట్విట్ కు సమాధానం ఇచ్చారు. L.V.ప్రసాద్ లేదా, సరోజిని దేవి ఐ ఆస్పత్రిలో సాయం అందిస్తాం అని రిప్లై ఇచ్చారు. ట్వీట్‌ చేయడమే కాదు, L.V.ప్రసాద్ ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వెంటనే ఆపరేషన్ జరిగేటట్టు చేశారు. దీంతో పాప తల్లిదండ్రులు, బంధువుల సంతోషానికి అవధులు లేవు. ఎక్కడో ఆంధ్ర లో పుట్టిన పాపకు తెలంగాణ మంత్రి సహాయం చేయడాన్ని పాప తల్లి దండ్రులే కాదు అందరూ హర్షిస్తున్నారు. ఇలా మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుకు నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories