ప్రైవేట్ కంపెనీలో దారుణం.. బాలికపై అత్యాచారం

ప్రైవేట్ కంపెనీలో దారుణం.. బాలికపై అత్యాచారం
x
Highlights

విశాఖలో సమాజం తలదించుకునే ఘటన మరొకటి జరిగింది. మూగ బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. తనకు జరిగిన అన్యాయం ఎవరి...

విశాఖలో సమాజం తలదించుకునే ఘటన మరొకటి జరిగింది. మూగ బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. తనకు జరిగిన అన్యాయం ఎవరి చెప్పుకోలేని స్థితిలో ఉన్న యువతి చివరికి తన సోదరుడి ద్వారా విషయాన్ని బయటపెట్టింది. ఇదే దారుణమంటే ఆ బదిర బాలిక శీలానికి వెలకట్టారు కొందరు నీచులు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ అఘాయిత్యం జరిగింది. విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న గిరిజన బదిర బాలికపై బస్సు డ్రైవర్ విశ్వనాథ్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు బాలిక శీలానికి వెలకట్టాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని లక్షన్నర ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం బాధిత బాలిక, డ్రైవర్ విశ్వనాథ్ మధ్య బేరం కుదిర్చింది. అందులో 25 వేలు కమీషన్ తీసుకొని న్యూ ఇయర్ వేడుకలు కూడా చేసుకున్నారు. అత్యంత నీచమైన ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సుమోటోగా అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడు విశ్వనాథ్‌తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత బాలికకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖలో మహిళలకు భద్రతనేది ఉందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories