మైనర్‌ బాలికపై లైంగిక దాడి.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దుర్మార్గులు

x
Highlights

మృగాళ్లు మారడం లేదు. అమ్మాయిలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీణవంక లాంటి ఘటనే జగిత్యాల జిల్లా మైతాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్‌...

మృగాళ్లు మారడం లేదు. అమ్మాయిలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీణవంక లాంటి ఘటనే జగిత్యాల జిల్లా మైతాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగిక దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌ చిత్రీకరించారు.

లైంగిక దాడిని ఎవరికైనా చెబితే వీడియో మొత్తాన్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బాధితురాలిని బెదిరించారు. మూడు రోజుల పాటు ఘోరాన్ని మనసులో దాచుకున్న బాధితురాలు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories