సిపాయి కాదు..సెక్స్ నేరగాడు..కాపాడాల్సిన జవానే..కీచకుడయ్యాడు..

x
Highlights

దేశ రక్షణకు ప్రాణాలు ఒడ్డాల్సిన జవాను రాక్షసుడిలా మారాడు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాడు అఘాయిత్యానికి ఒడి గట్టాడు. ఓ ప్రేమ జంటపై దాడి చేయడమే కాదు...

దేశ రక్షణకు ప్రాణాలు ఒడ్డాల్సిన జవాను రాక్షసుడిలా మారాడు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాడు అఘాయిత్యానికి ఒడి గట్టాడు. ఓ ప్రేమ జంటపై దాడి చేయడమే కాదు కీచక పర్వానికి యత్నించి కటకటాలపాలయ్యాడు. అయితే ఈ క్రైమ్ స్టోరీలో ఆర్మీ జవానును వెంటాడి వెంటాడి పడ్డుకున్నది పోలీసులే కావడం విశేషం.

సికింద్రాబాద్ తిరుమలగిరి అమ్ముగూడ ప్రాంతం వేదికగా కీచక పర్వానికి పాల్పడుతున్న ఓ జవాను అకృత్యాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమ్ముగూడ మిలటరీ ప్రాంతంలో కలుసుకున్న ఓ ప్రేమ జంటపై దాడి చేసి యువతిపై అత్యాచారం చేయడానికి విఫలయత్నం చేసిన జవానును పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో జవాను గత క్రైమ్ స్టోరీ కూడా బయటపడింది.

సోమవారం రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు ప్రేమికులు అమ్ముగూడ రైల్వే గేట్ దగ్గర కలుసుకున్నారు. అంతలోనే ఊహించని ఉపద్రవం జవాను రూపంలో వారికి ఎదురైంది. ప్రేమజంట దగ్గరకికి వచ్చిన సిపాయి ప్రియుడిని తీవ్రంగా గాయపరిచి ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడు. జవాను కొట్టిన దెబ్బల ధాటికి ప్రేమికుడు స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత యువతిని రేప్ చేయబోగా వెంటనే ఆమె 100 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. ఇంతలో ఆమె అరుపులు అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ పార్టీ కానిస్టేబుల్ చంద్ర శేఖర్‌కు వినిపించాయి. చంద్రఖేఖర్ ఒక్క ఉదుటన ఘటనా స్థలికి రావడం జవానుని పట్టుకోవడానికి ప్రయత్నించడం అతను పరారవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి. అయితే చంద్రశేఖర్ కూడా మెరుపు వేగంతో నిందితుడిని వెంటాడాడు. నిందితుడు చంద్రశేఖర్‌పై దాడి చేసినా అతను మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా వెంబడించి మరీ పట్టుకున్నాడు.

సహచర సిబ్బంది సాయంతో కానిస్టేబుల్ చంద్రశేఖర్... జవానుని పట్టుకున్నాడు. నిందితుడి దగ్గర ఉన్న ఐడీ కార్డ్ ఆధారంగా ఆర్మీలో పనిచేసే బ్రిజేష్ కుమార్ యాదవ్ గా గుర్తించారు, బీహార్ స్టేట్ భగల్ పూర్‌కు చె్ందిన ఇతను..గత సంవత్సరం డిసెంబర్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపినట్లు దర్యాప్తులో తేలింది. అత్యంత ధైర్యసాహసాలతో లైంగిక వేధింపుల నేరగాడు బ్రిజేష్ కుమార్ ను పట్టుకున్న చంద్ర శేఖర్‌తో పాటు ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు. జవాను రూపంలో ఉన్న కీచకుడి ఆట కట్టించిన తిరుమలగిరి పోలీసు పెట్రోలింగ్ సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories