అనంతలో ఘోరం... తొమ్మిదో తరగతి విద్యార్ధిని ప్రసవం

అనంతలో ఘోరం... తొమ్మిదో తరగతి విద్యార్ధిని ప్రసవం
x
Highlights

మైనర్‌ ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అనంతపురంలో జరిగింది. బుక్కరాయసముద్రం వీరభద్ర కాలనీకి చెందిన బాలిక ఓ ప్రభుత్వ హైస్కూల్లో 9 వ తరగతి చదువుతోంది. పదేళ్ల...

మైనర్‌ ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అనంతపురంలో జరిగింది. బుక్కరాయసముద్రం వీరభద్ర కాలనీకి చెందిన బాలిక ఓ ప్రభుత్వ హైస్కూల్లో 9 వ తరగతి చదువుతోంది. పదేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రితో కలిసి ఓ కాలనీలో జీవిస్తోంది. అయితే గత కొంతకాలంగా కడుపులో గడ్డ ఉందని తండ్రి తో నమ్మబలుకుతూ వచ్చిన బాలిక పురుటి నొప్పులు ఎక్కువవ్వటంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా గడిచిన మూడు నెలలుగా బాలిక పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories