వైద్యం చేయించుకున్న కేటీఆర్

వైద్యం చేయించుకున్న కేటీఆర్
x
Highlights

మేడ్చల్ జిల్లా మల్కాజ్‌‌గిరిలో బస్తీ దవాఖానను ప్రారంభించారు ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీరెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా దవాఖానలో లక్ష్మారెడ్డి...

మేడ్చల్ జిల్లా మల్కాజ్‌‌గిరిలో బస్తీ దవాఖానను ప్రారంభించారు ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీరెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా దవాఖానలో లక్ష్మారెడ్డి కేటీఆర్‌కు ప్రథమ చికిత్స చేశారు. రాష్ట్రంలో 45కు పైగా వెల్‌నెస్‌ సెంటర్‌లను ఏర్పాటు చేశామని, వాటిలో భాగంగా 17 వెల్‌నెస్‌ సెంటర్‌లు అందుబాటులో ఉన్నాయని మంత్రులు తెలిపారు. వివిధ పథకాలలో భాగంగా డయాగ్నస్టిక్‌ సెంటర్‌లను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆనంద్‌భాగ్‌లో 29 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్‌యుబి...ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతల కనకా రెడ్డి, స్థానిక కార్పోరేటర్లు పాల్గొన్నారు.

Ministers KTR and Laxma Reddy inaugurated a Basti Dawakhana in Malkajgiri

Show Full Article
Print Article
Next Story
More Stories