పవన్ గుండుపై స్పందించిన మంత్రి సునీత... రవి చెప్పిన విషయం ఇదే..!

Highlights

మొన్నటికిమొన్న తనకు మాజీ మంత్రి పరిటాల రవి గుండు కొట్టించాడన్న వివాదంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీలో తానంటే గిట్టని వాళ్ళు తనపై...

మొన్నటికిమొన్న తనకు మాజీ మంత్రి పరిటాల రవి గుండు కొట్టించాడన్న వివాదంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీలో తానంటే గిట్టని వాళ్ళు తనపై దుష్పచారం చేసారని.. అలాంటిదేమి లేదని స్పష్టం చేసారు.. ఇక ఆ సమయాల్లో నేను దేవుడికి ముక్కు చెల్లించుకుని ఉంటాను, అంతేకాని తనకు పరిటాల రవి గుండు కొట్టించారని అనడం సరికాదన్నారు.. ఇక దీనిపై రవి భార్య మంత్రి సునీత స్పందించారు.. రవి అంతకు దిగజారేవారు కాదని.. అయినా తనకు తెలిసి ఆలా చేసి ఉండరని ఆమె అన్నారు.. ఎవరికైనా కష్టమొచ్చినప్పుడు ఆదుకుందామనే మనసత్త్వం పరిటాల రవిది అలాంటి వ్యక్తిత్వం ఉన్న నేత పవన్ అని మంత్రి సునీత చెప్పారు.. ఈ పుకారులన్ని తమ కుటుంభం అంటే సరిపడనివాళ్ళు తమతో విభేధించలేక పవన్ ను అడ్డం పెట్టుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని సునీత ఎద్దేవా చేసారు..

రవి చెప్పిన విషయం ఇది..!

ఇక అప్పట్లో ఈ వ్యవహారంపై స్పందించిన పరిటాల అది అంతా అబద్దమని కొట్టిపారేశారు.. అసలు వివాదం ఇదని చెబుతూ.." హైదరాబాద్ ఫిలిం నగర్లో నా ఇంటి పక్కన ఉన్న స్థలం కొనుగోలు చేయడానికి చిరంజీవి ముందుకొచ్చారు.. అప్పుడు నేను వద్దని వారించాను.. నాకు భద్రత ఇబ్బందులు తలెత్తవచ్చు.. అంచేత మీకు ఏమైనా జరగవచ్చు అని నేను ఆ స్థలం కొనవద్దని సలహా ఇచ్చానని రవి చెప్పారు" అంతకు మించి మా ఫ్యామిలీకి చిరు ఫ్యామిలీకి సంబంధమే లేదని స్పష్టం చేసారు..

Show Full Article
Print Article
Next Story
More Stories