‘లోకేశ్‌ అడిగితే నా సీటిచ్చేస్తా’

‘లోకేశ్‌ అడిగితే నా సీటిచ్చేస్తా’
x
Highlights

రానున్న ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు...

రానున్న ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ..మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. లోకేష్ అడిగితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట సీటును ఇచ్చేస్తానని చెప్పారు. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వడానికి 175 నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోకేష్ కు సీటు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ఐదేళ్లు పాలించాలని తమకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారని తెలిపారు. ఓటమి భయంతోనే బీజేపీ ముందస్తుకు వెళ్లేందుకు యత్నిస్తోందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories