'రైతు బంధు' పథకంపై పోచారం సమీక్ష

రైతు బంధు పథకంపై పోచారం సమీక్ష
x
Highlights

ఈ నెల 20 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని అభినందించేలా కార్యక్రమం...

ఈ నెల 20 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని అభినందించేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు. పథకం అమలు, పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్కాడ్ ఏర్పాటు చేసింది సర్కార్. చెక్ పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెక్కుల పంపిణీ గ్రామాలలో పండుగలా జరగాలని సూచించారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితీ సభ్యుల సహకారం తీసుకోవాలని చెప్పారు.

అన్నదాతలకు భరోసానిచ్చే రైతుబంధు పథకం చెక్కులు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగోతో ఈ చెక్కులను ముద్రిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన చెక్కులపై రైతుబంధు పథకం అని పేర్కొనడంతో పాటు వాటర్ మార్క్ తరహాలో తెలంగాణ లోగోను కూడా పెద్ద సైజులో ముద్రించారు.

మూడునెలల పాటు చెల్లుబాటయ్యే ఈ చెక్కులపై లబ్దిదారుల పేరు, పాసుబుక్ యూనిక్ ఐడి, రైతు గ్రామం, మండలం, జిల్లాల పేర్లు ఉన్నాయి. ఎకరాకు 4 వేల చొప్పున లెక్కకట్టి ఈ మొత్తం ఇస్తారు. ఎస్బీఐ సంస్థ ముంబైలో చెక్కులను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే, ప్రభుత్వం ఇవ్వనున్న పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాలకన్నది రైతులే లెక్క చూసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు చెక్కులపై ఉండవు.

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ముద్రించే ఒక్కో చెక్కుకు 135 ఖర్చు అవుతోంది. చెక్కు ముద్రణకు 115 అవుతుండగా, జిఎస్టి కూడా ఇందులో కలుస్తుంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రైతులకు తక్కువలో తక్కువ ఒక్క గుంట భూమికి కూడా 100 పెట్టుబడి సాయం అందనుంది. గుంట భూమి కలిగిన వాళ్ళు దాదాపు ఒక లక్షన్నర మంది ఉంటారని, మొత్తం రైతులలో వీళ్లు 2% అని అధికారులు చెబుతున్నారు. వీళ్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందేది కేవలం 100 మాత్రమే. మండల వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో ఏఈఓలు హైదరాబాద్‌లో ముద్రించిన చెక్కులను లెక్కించుకుని ఎస్కార్ట్ సాయంతో గ్రామాలకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతు బంధు పథకంపై సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 3,300 గ్రామాల వివరాలను చెక్కుల ముద్రణకు బ్యాంకులకు పంపామని మంత్రి చేప్పారు. చెక్ ల పంపిణిలొ స్థానిక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధులు, అధికారులతో గ్రామ సభ నిర్వహించి ప్రతి రైతుకు స్వయంగా చెక్కులను అందించే విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు మంత్రి. అంతేకాక ఈ కార్యక్రమం గ్రామంలోని రైతులందరికి అదేరోజు పంపిణీ చేయ్యాలని చెప్పారు. ప్రతీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తన జిల్లాలో ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామం, ADA లు ప్రతీ మండలంలోని ఒక గ్రామంలో పర్యవేక్షించి, తనిఖీ చేయ్యల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి అధికారిని ఇంచార్జీగా నియమించి చెక్ ల పంపిణి పూర్తి చేసేందుకు రెడీ కావాలని అధికారులను అదేశించారు మంత్రి పోచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories