జగన్మోహన్‌ రెడ్డి పేరు మారింది: నారా లోకేశ్‌

జగన్మోహన్‌ రెడ్డి పేరు మారింది: నారా లోకేశ్‌
x
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో...

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో పర్యటిస్తోన్న లోకేశ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లు ఏపీకి కేంద్ర సర్కారు ద్రోహం చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి జగన్‌, పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు. మోడీపై విమర్శలు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భ‌యంప‌ట్టుకుంద‌ని నారా లోకేశ్ విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి పేరు మారిందని, ఇప్పుడు ఆయన పేరు జగన్‌ మోడీ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 25 కి 25 లోక్‌సభ సీట్లు సాధిస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories