బీజేపీ, కేసీఆర్‌ లపై లోకేష్ ఫైర్..

బీజేపీ, కేసీఆర్‌ లపై లోకేష్ ఫైర్..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ బాబు బీజేపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పై విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ...

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ బాబు బీజేపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పై విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం లో లోకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే కెసిఆర్ అది చేస్తున్నాడని విమర్శించాడు. కేంద్రం ఆదేశాల అనుగుణంగానే కెసిఆర్ తన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిస్కారం కోసం చర్చించడం కొరకు ఎన్ని సార్లు అప్పోయింట్ అడిగినా మోడీ తిరస్కరించారని అయన అన్నారు. కెసిఆర్ అడిగిన వెంటనే అప్పాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు.. ముఖ్యమంత్రులకు సమయం కేటాయించలేని ప్రధాని కెసిఆర్ కుమారుడికి అవకాశం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
అదేవిదంగా జగన్ మోహన్ రెడ్డి పై కూడా విమర్శలు చేశారు. కేంద్రం అవినీతిపరుడైన జగన్ మోహన్ రెడ్డి కి సహకరిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి పరుల ఆస్తుల జప్తు బిల్లును కేంద్రానికి పంపిస్తే ఇంత వరకు అమలు చెయ్యలేదని దుయ్యబట్టారు..

Show Full Article
Print Article
Next Story
More Stories