అంబేద్కర్‌ విగ్రహం పక్కన వైఎస్‌ విగ్రహం పెట్టడం సిగ్గుచేటు

అంబేద్కర్‌ విగ్రహం పక్కన వైఎస్‌ విగ్రహం పెట్టడం సిగ్గుచేటు
x
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు దమ్ముంటే దళితుల సంక్షేమంపై చర్చకు రావాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో...

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు దమ్ముంటే దళితుల సంక్షేమంపై చర్చకు రావాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి నక్కా.. దళితుల విషయంలో జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు వస్తోందని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఇడుపులపాయలో దళితుల భూములు దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదన్నారు. దళితుల భూముల్లోనే రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి సమాధులు నిర్మించారని ఆరోపించారు. అసెంబ్లీలో దళితులు భూములు తిరిగిస్తానని చెప్పిన వైఎస్ మాట ఏమైంది? అని మంత్రి సూటి ప్రశ్న సంధించారు. మహనీయుడు అంబేద్కర్ విగ్రహం పక్కన వైఎస్సార్ విగ్రహం పెట్టడం సిగ్గుచేటు అని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories