ప్రభుత్వంపై మంత్రి మాణిక్యాలరావు హాట్ కామెంట్స్‌..నన్ను కట్ చేయాలని చూస్తే....

ప్రభుత్వంపై మంత్రి మాణిక్యాలరావు హాట్ కామెంట్స్‌..నన్ను కట్ చేయాలని చూస్తే....
x
Highlights

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దూకుడు పెంచారు. మంత్రిగా కొనసాగుతూనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నన్ను నిలదీయాలని చూస్తే తాను...

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దూకుడు పెంచారు. మంత్రిగా కొనసాగుతూనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నన్ను నిలదీయాలని చూస్తే తాను ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు. అక్కడితో ఆగని మాణిక్యాలరావు తనని కట్‌ చేయాలని చూస్తే, ఆంధ్రప్రదేశ్‌ను కట్‌ చేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కొంతకాలంగా మీడియాకు కేంద్రబిందువుగా మారుతున్నారు. ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ను ట్రాప్‌ చేసి ఇరికించారని అన్నారు. గజల్‌ శ్రీనివాస్‌ చాలా మంచివాడని వెనుకేసుకొచ్చారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో వ్యాఖ్యలను ఉపసంరించుకున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా రామన్నగూడెంలో జరిగిన గ్రామసభలో ప్రభుత్వంపై డోస్‌ పెంచారు. కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్రంలో పనులు సవ్వంగా జరుగుతున్నాయన్నారు. తనని నిలదీయాలని చూస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు.

మొన్న రామన్నగూడెంలో జరిగిన జన్మభూమి సభలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులిస్తేనే జడ్పీలో ఖర్చు పెడుతున్నారని నిధులకు బ్రేకులు వేయిస్తే మీ పరిస్థితి ఏంటని జడ్పీ ఛైర్మన్‌ను టార్గెట్ చేశారు మాణిక్యాలరావు. అక్కడితో ఆగని మంత్రి జన్మభూమి సభలకు వచ్చే వారంతా పించన్లు తీసుకునేందుకు వచ్చే వారేనని జన్మభూమి కార్యక్రమంపై మమకారంతో ఎవరు రావడం లేదన్నారు. గతంలోనూ ఫ్లెక్సీ వివాదంలో తాడేపల్లిగూడెం సీఐని మాణిక్యాలరావు బండబూతులు తిట్టారు. మంత్రి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories