గెలిచేది టీఆర్‌ఎస్.. సీఎం అయ్యేది కేసీఆర్ : కేటీఆర్

గెలిచేది టీఆర్‌ఎస్.. సీఎం అయ్యేది కేసీఆర్ : కేటీఆర్
x
Highlights

రాష్ట్రంలో గెలిచేది టీఆర్‌ఎస్.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా స్పష్టంగా...

రాష్ట్రంలో గెలిచేది టీఆర్‌ఎస్.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడని ఆయన పేర్కొన్నారు. మక్తల్‌లో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో మాట్లాడిన కేటీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు జిల్లా బాగా నష్టపోయిందన్నారు. అప్పర్ కృష్ణా పూర్తయి ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చగా ఉండేదని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రాజెక్టుల కింద 8 లక్షల నుంచి 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని చెప్పారు. పాలమూరు పచ్చబడుతుందంటే, వలస పోయిన వారు తిరిగి వస్తున్నారంటే అది టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనత అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories