రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఘాటు స్పందన

రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఘాటు స్పందన
x
Highlights

ప్రధాని మోడీని తిట్టాడని మణి శంకర్‌ అయ్యర్‌పై కాంగ్రెస్‌ వేటేసింది. ఈ పాయింటే మంత్రి కేటీఆర్‌ పట్టుకున్నారు. ట్విట్టర్‌ వేదికగా రేవంత్‌పై వేటుకి...

ప్రధాని మోడీని తిట్టాడని మణి శంకర్‌ అయ్యర్‌పై కాంగ్రెస్‌ వేటేసింది. ఈ పాయింటే మంత్రి కేటీఆర్‌ పట్టుకున్నారు. ట్విట్టర్‌ వేదికగా రేవంత్‌పై వేటుకి పట్టుబట్టారు. కేబినెట్‌ మినిస్టర్‌ని హీనంగా విమర్శించిన రేవంత్‌ను కాంగ్రెస్‌ ఎందుకు సస్పెండ్‌ చేయదని నిలదీశారు. మరి మంత్రి లక్మారెడ్డి ఏమన్నారో కూడా కేటీఆర్‌ వినాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ నేత రేవంత్‌, మంత్రి లక్ష‌్మారెడ్డి మధ్య పేలిన మాటల తూటాలపై ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. జడ్చర్లలో జరిగిన సభలో మంత్రి లక్ష్మారెడ్డిని నకిలీ డాక్టరంటూ రేవంత్‌ వ్యాఖ్యలు దుమారం రేపాయి. వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామంటూ మంత్రి లక్ష‌్మారెడ్డి ఘాటుగానే స్పందించారు. మంత్రి లక్ష్మారెడ్డి కామెంట్స్‌పై రేవంత్‌ కూడా తిరిగి ఘాటుగానే కౌంటర్‌ ఇచ్చారు.

గుజరాత్‌లో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌పై ఆ పార్టీ వేటు వేసింది. అదే రీతిలో గౌరవనీయ మంత్రిపై రేవంత్‌ నీచంగా కామెంట్లు చేశారని, రాహుల్‌ కానీ, టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ కానీ చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అలా రేవంత్‌పై చర్య తీసుకోకుంటే కేవలం గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలోనే మణి శంకర్‌ అయ్యర్‌పై వేటు వేశారని భావించాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి సైతం ఘాటుగానే స్పందించారు. ముందు మంత్రి లక్ష్మారెడ్డే నోరు పారేసుకున్నారని, ముందు అది విని తరువాత తనను విమర్శించాలని మంత్రి కేటీఆర్‌కి రేవంత్‌ హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories