నీలాంటి వాడిని ఎప్పుడూ చూడలేదని సీఎం అన్నారు

నీలాంటి వాడిని ఎప్పుడూ చూడలేదని సీఎం అన్నారు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా ఎవరు కష్టపడే వ్యక్తులు లేరన్నారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌. నాలుగేళ్ల పాటు మంత్రిగా పని చేయడం సంతృప్తిగా ఉందన్న ఆయన...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా ఎవరు కష్టపడే వ్యక్తులు లేరన్నారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌. నాలుగేళ్ల పాటు మంత్రిగా పని చేయడం సంతృప్తిగా ఉందన్న ఆయన టీడీపీ, బీజేపీ నేతలందరూ కలిసి తనను గెలిపించారని గుర్తు చేశారు. తానీ స్థాయిలో ఉండటానికి కారణం బీజేపీనే కారణమన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితం తెదేపాతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. 2014లో వెంకయ్యనాయుడు సూచన మేరకు భాజపాలో చేరాను.

అనంతరం తెదేపా-భాజపా పొత్తుతో ఎమ్మెల్యే అయ్యాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించగలిగాను. నా జీవితంలో మంచి స్నేహితులను సంపాదించుకున్నాను. నా గురించి అభిప్రాయం చెప్పాలని కోరినప్పుడు ‘నీ లాంటి అజాత శత్రువును నేను ఎప్పుడూ చూడలేదు. మూడున్నరేళ్లలో నీ గురించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు’ అని చెప్పినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. నా కింద అధికారులతోనూ స్నేహభావంతోనే మెలిగాను. రాజకీయ కారణాలతో కొందరు నాపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. అవన్నీ నేను పట్టించుకోను. రాజకీయాల్లో ప్రవేశం, నిష్క్రమణ బాగుండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతుడినే. మంత్రి పదవి తాత్కాలికమే అని భావించే పనిచేశాను. అందుకే ఇప్పుడు రాజీనామా చేసినా బాధపడటం లేదు’ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories