Top
logo

దళితులపై దాడులు బాధాకరం : హరీష్‌రావు

దళితులపై దాడులు బాధాకరం : హరీష్‌రావు
X
Highlights

భారత్ బంద్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో...9మంది మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి హరీశ్‌రావు. దళితులకు...

భారత్ బంద్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో...9మంది మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి హరీశ్‌రావు. దళితులకు బ్రిటీష్ హయాం నుంచే ప్రత్యేక చట్టాలున్నాయన్న ఆయన కాంగ్రెస్‌, బీజేపీలు దశాబ్దాలుగా పాలిస్తున్న దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితులు, గిరిజనులకు ప్రత్యేక చట్టాలున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఆత్మపరిశీలన చేసుకోకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం దారుణమన్నారు. న్యాయస్థానాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకొని వ్యవహరించాలన్న హరీశ్‌రావు పోలీసులు, బలప్రయోగంతో దళితులను అణచివేయాలని చూస్తే ఫలితం ఉండదన్నారు.

Next Story