పొలాల్లో నవదంపతులు నాట్లు

x
Highlights

పొలాల్లో కొత్త జంట సందడి చేసింది. వంగి వరినాటు వేసి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి పక్కన నిల్చొన్న వారు నవ్వూతూ కనిపిస్తున్నాడు. ఇంతకీ...

పొలాల్లో కొత్త జంట సందడి చేసింది. వంగి వరినాటు వేసి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి పక్కన నిల్చొన్న వారు నవ్వూతూ కనిపిస్తున్నాడు. ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా ?. వారే నండి ఇటీవల వివాహం చేసుకుని ఒక్కటైన ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడు. నవదంపతులు నాట్లు వేయడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామం గుండా ఈ నూతన జంట వెళ్తుండగా అక్కడ పాములేని అనే రైతు పొలంలో కూలీలు వరినాట్లు వేస్తూ కనిపించారు. దాన్ని గమనించిన మంత్రి అఖిల ప్రియ ఉత్సాహంగా కారు దిగి భర్తను కూడా తనతో పాటూ పొలంలోకి తీసుకెళ్లింది. కాసేపు వరినాట్లు వేసి తన ముచ్చటను తీర్చుకుంది. అనంతరం కాసేపు కూలీలీతో సరదాగా ముచ్చడించింది. ఎకరాకు ఎంత కూలీ ఇస్తున్నారు అని ఆరా తీశారు. కొత్త దంపతులు తమతో కలిసి పనిచేయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అఖిల ప్రియ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories