జగన్ ఎపిసోడ్ అంతా ఓ సినిమా : మంత్రి ఆదినారాయణ రెడ్డి

nanireddy
Updated on: 24 Dec 2018 3:52 PM IST
జగన్ ఎపిసోడ్ అంతా ఓ సినిమా : మంత్రి ఆదినారాయణ రెడ్డి
X

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై వి శాఖ ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నం ఎపిసోడ్ ఓ సినిమాలా అనిపిస్తోందని ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి అన్నారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన అయన. ఏపీ పోలీసు అధికారులు సీఎం చెప్పుచేతల్లో ఉన్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అయన తీవ్రంగా ఖండించారు. జగన్ హత్యాయత్నం కేసు విషయంలో ఆ పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు విశాఖ పోలీసు కమిషనర్‌ మహేష్‌చంద్ర‌ లడ్డా ఎవరిమాట వినకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపే అధికారి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. కాగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒక్క నెలలో 15 వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు. దీనికోసం రాయల స్టీల్ అథారిటీని ఏర్పాటు చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలో కడప కూడా ఉందని అన్నారు.

nanireddy

nanireddy

Next Story