మతిస్థిమితం లేని వ్యక్తిపై పోలీసుల అరాచకం...ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

మతిస్థిమితం లేని వ్యక్తిపై పోలీసుల అరాచకం...ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
x
Highlights

సోషల్‌ మీడియా వదంతులు ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటున్న పోలీసులు... మతిస్థిమితం లేని వ్యక్తి పట్ల అత్యంత కర్కశంగా...

సోషల్‌ మీడియా వదంతులు ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటున్న పోలీసులు... మతిస్థిమితం లేని వ్యక్తి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించారు. అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతున్న ఈ వ్యక్తిని పిల్లల్ని కిడ్నాప్‌ చేసే వ్యక్తిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అతని చేతులు కాళ్ళు కట్టేసి... ఓ అటవీ ప్రాంతంలో పడేసి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కే మాయని మచ్చ తెచ్చారు రాచకొండ పోలీసులు. దీనిపై విచారణ చేపట్టిన సీపీ బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాదు.. మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును సుమోటుగా స్వీకరించి విచారణ జరుపుతోంది.

మీర్‌‌పేట మారుతీనగర్‌లో గతనెల 20న ఓ గుర్తుతెలియని వ్యక్తి వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండంతో అతనిని దొంగగా భావించారు స్థానికులు. కాళ్ళు చేతులు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడిన అతణ్ని ఆసుపత్రికి తరలించాలన్న ఆలోచన కూడా లేకుండా... హయత్‌నగర్‌ మండలం బ్రహ్మణపల్లి సమీపంలో కనీసం కట్లు కూడా విప్పకుండా అలాగే ఆ అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లారు.

బ్రాహ్మణపల్లిలో తిండి తిప్పలు లేక.. ఎండకు నీరసించి పోయాడతను. అప్పటికే ఆ వ్యక్తికి ఫిట్స్ రావడంతో స్థానికులు సహాయంతో పోలీసులు ఆస్పత్రికి చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీసులు అతన్ని అక్కడ పడేసి వెళ్ళంది ఎవరనేది విచారణ జరిపారు. ఆ విచారణలో మీర్‌పేట్ పోలీసుల నిర్వాకం బయటపడింది. మే 20న మీర్‌పేట్‌లో స్థానికుల దాడి సమయంలో కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉన్న వ్యక్తి ఇతనే అని తెలియడంతో మరింత దర్యాప్తు చేయగా .. ఈ అమానవీయంగా వ్యవహరించింది పోలీసులే అని తేలింది.

అతని మరణానికి మీర్‌పేట్ పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తేల్చిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకున్నారు సీపీ మహేష్ భగవత్. ఇందులో విచారణ జరిపిన స్పెషల్ టీమ్ ఇచ్చిన నివేదికతో మీర్‌పేట్ ఠాణాలో పనిచేస్తున్న ఏఎస్సై చాంద్‌బాష, హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, హోంగార్డు రాజులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఎస్సైలకు ఛార్జ్‌మెమోలు ఇచ్చారు. కాని పోలీసులపై చర్యలు చేపట్టినట్లు సీపీ అధికారంగా ప్రకటించలేదు. కాని ఈ ఘటనను సూమోటోగా తీసుకున్న హెచ్చార్సీ ఈనెల18లోగా నివేదిక సమర్పించాలని సీపీని ఆదేశించింది. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటికే నలుగురు మల్కాజిగిరి SOT పోలీసులను సస్పెండ్ చేసిన సీపీ మహేష్ భగవత్....తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని...మీర్ పేట్ పోలీసుల ఘనకార్యం బయటకు పొక్కకుండా సీక్రెసీ మెయింటెన్ చేస్తున్నారని అంటున్నారు స్థానికులు.

CRIME

Show Full Article
Print Article
Next Story
More Stories