మేకపాటికి అస్వస్థత

మేకపాటికి అస్వస్థత
x
Highlights

ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆమరణదీక్షలు రెండో రోజుకి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీభవన్‌‌ వేదికగా మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ...

ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆమరణదీక్షలు రెండో రోజుకి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీభవన్‌‌ వేదికగా మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు దీక్షలు కొనసాగిస్తున్నారు. వైసీపీ ఎంపీల దీక్షకు సంఘీభావంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వస్తున్నారు. ఇక ఢిల్లీలో నివసిస్తోన్న తెలుగువాళ్లు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధులు పెద్దఎత్తున తరలివచ్చి... మద్దతు ప్రకటిస్తున్నారు.

ఆమరణదీక్ష చేస్తోన్న వైసీపీ ఎంపీల్లో మేకపాటి రాజమోహన్‌‌రెడ్డి అప్పుడే అస్వస్థతకు గురయ్యారు. దాంతో మేకపాటికి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే అస్వస్థతను లెక్క చేయకుండా ...మేకపాటి దీక్ష కొనసాగిస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీల దీక్షలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories