logo
జాతీయం

మేఘాలయలో ఆధిక్యం దిశగా కాంగ్రెస్‌

మేఘాలయలో ఆధిక్యం దిశగా కాంగ్రెస్‌
X
Highlights

ఈశాన్య రాష్ట్రాల తీర్పు వెలువడుతోంది. మేఘాలయలో అధికార కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ వెలువడిన...

ఈశాన్య రాష్ట్రాల తీర్పు వెలువడుతోంది. మేఘాలయలో అధికార కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ అభ్యర్థులు 17 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఎన్‌పీపీ 7, భాజపా 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 6 చోట్ల ముందంజలో ఉన్నారు. ఇక్కడ పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. 60 స్థానాలకుగాను 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓ ఎన్‌సీపీ అభ్యర్థి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోగా ఇక్కడ ఎన్నిక వాయిదా వేశారు.

Next Story