టీఆర్‌ఎస్‌లో చేరడంపై కార్యకర్తల వద్ద సండ్ర స్పందన

nanireddy
Updated on: 28 Dec 2018 12:13 PM IST
టీఆర్‌ఎస్‌లో చేరడంపై కార్యకర్తల వద్ద సండ్ర స్పందన
X

గతకొద్ది రోజులుగా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన అధికార టీఆరెస్ లో చేరతారని అనుకుంటున్నారు. దాంతో అయోమయానికి గురైన టీడీపీ కార్యకర్తలు రెండు రోజులుగా ఎమ్మెల్యే సండ్రతో భేటీ అవుతున్నారు. అయితే తాను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఈ సందర్భంగా సండ్ర.. వారికి చెప్పినట్లు సమాచారం. వెంకటవీరయ్య మంత్రి పదవి ఆఫర్‌తో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని తాము భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తన ప్రయత్నాలు ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆరెస్ లోకి తీసుకువచ్చేందుకు తుమ్మల బాధ్యత తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

nanireddy

nanireddy

Next Story