మరో పరువుహత్య వెలుగులోకి.. కూతురిని దారుణంగా చంపి..

nanireddy
Updated on: 24 Dec 2018 3:31 PM IST
మరో పరువుహత్య వెలుగులోకి.. కూతురిని దారుణంగా చంపి..
X

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు సంఘటన మరవకముందే మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన ఎర్రమ్మ, నారాయణ స్వామి దంపతుల కూతరు హేమశ్రీ.. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని హేమాశ్రీ తల్లిదండ్రులు ఆమెను అంతమొందించాలని అనుకున్నారు. పెళ్లిచేసుకుని ఊళ్లోకి వచ్చిన హేమశ్రీని కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అదే రోజు ఆమెను హత్యచేసి కెనాల్‌లో పడేసి… ఊరు విడిచి పరారయ్యారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

nanireddy

nanireddy

Next Story