వివాహ వేడుకల్లో కాల్పులు...వధువు మృతి

పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ...
పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ ఘటన హోషియార్ పూర్‌లో గత శనివారం చోటుచేసుకుంది.హోషియార్ పూర్ పట్టణానికి చెందిన సాక్షి అరోరా జలంధర్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. సాక్షి అరోరా తండ్రి చరణ్ జిత్ అరోరా ఆమె పెళ్లి వైభవంగా చేసేందుకు డీజేతోపాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఉత్సవంలో భాగంగా డీజేపార్టీ సాగుతుండగా వధువు భవనం పైన నిలబడి వేడుకను తిలకిస్తోంది. అంతలో పెళ్లికి వచ్చిన అతిధులు వేడుకల్లో భాగంగా అత్యుత్సాహంతో అశోఖ్ సేథి, ఖోస్లాలు తాము తెచ్చిన డబుల్ బ్యారెల్ రైఫిల్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో బుల్లెట్ భవనం పైన నిలబడిన వధువు కణతకు తగిలి అక్కడికక్కడే మరణించింది. దీంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి సెక్షన్ 302, 34, ఆయుధాల వినియోగ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరైన ఖోస్లాను అరెస్టు చేశారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT