శ్రీశ్రీ ఆ పేరు వింటేనే ఓ శక్తి ఉద్బవిస్తుంది

శ్రీశ్రీ ఆ పేరు వింటేనే ఓ శక్తి ఉద్బవిస్తుంది
x
Highlights

శ్రీశ్రీ ఆ పేరు వింటేనే... చాల మందిలో కొత్త సత్తువ పెల్లుబుకుతుంది... ఆ మహా కవి రచించిన సంచలన కవితా సంకలనమే ... మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత...

శ్రీశ్రీ ఆ పేరు వింటేనే... చాల మందిలో కొత్త సత్తువ పెల్లుబుకుతుంది... ఆ మహా కవి రచించిన సంచలన కవితా సంకలనమే ... మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది. మహా ప్రస్థానం కవితా సంపుటికి యోగ్యతాపత్రం శీర్షికన ఉన్న ముందుమాట ప్రముఖ తెలుగు రచయిత గుడిపాటి వెంకట చలం వ్రాసినారు.
మహాప్రస్థాన కవితల రచన మొత్తంగా 1930 దశకంలో జరిగింది. కాని ఈ రోజు మీరు చదివినా.. అదే ఉత్సాహం మనకి ఇస్తుంది. ఇప్పటి వరకు చదవకుంటే.. వెంబడే... చదవండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories