ఒత్తిడి తో ఓడిన సింధు

ఒత్తిడి తో ఓడిన సింధు
x
Highlights

సింధు గెలిచెను సెమిస్లో, యమగూచి ఒడెను ఛాంపియన్షిప్లో, కాని మారినతోనే ఫైనల్లో, అమీ తుమిలో ఒత్తిడికి ఓడెను. శ్రీ.కో పెద్ద టోర్నీల్లో ఫైనల్‌ ఫైట్‌లో...

సింధు గెలిచెను సెమిస్లో,

యమగూచి ఒడెను ఛాంపియన్షిప్లో,

కాని మారినతోనే ఫైనల్లో,

అమీ తుమిలో ఒత్తిడికి ఓడెను. శ్రీ.కో

పెద్ద టోర్నీల్లో ఫైనల్‌ ఫైట్‌లో మాత్రం సింధు బోల్తా పడుతోంది. ఇందుకు ఒత్తిడే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కీలకమైన సమయాల్లో ఉద్వేగాన్ని, ఉత్కంఠను అదుపులో ఉంచుకోగలిగిన వారే చాంపియన్లుగా ఆవిర్భవిస్తారని అంటున్నారు. ఎక్కువ మ్యాచ్‌ లు ఆడాల్సిన సమయాల్లో టోర్నీ తుది అంకం వరకూ శక్తిసామర్థ్యాలను కాపాడుకోవాల్సి ఉంటుందని కూడా వారు సూచిస్తున్నారు. ఏదో ఒకటి రెండు టోర్నీలైతే పర్లేదుకానీ.. సింధుకు వరుసగా అలా జరుగుతుండడం అభిమానులను కూడా బాధిస్తోంది. కోచ్‌లు, ఫిజియోలు, ఇంకా మానసిక విశ్లేషకులు అంతా చర్చించుకొని సింధు ఫైనల్‌ ఫోబియాకు పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories