కిడారి, సోమను అందుకే హతమార్చాం

కిడారి, సోమను అందుకే హతమార్చాం
x
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హత్య చేసింది తామేనని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల...

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హత్య చేసింది తామేనని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ఏవోబీ అధికార ప్రతినిధి జగబంధు పేరుతో విడుదల చేసిన ఈ లేఖలో వారిని హత్యచేసినందుకు కారణాలను వెల్లడించారు. మైనింగ్‌ మాఫియాగా మారి ఆదివాసీల ప్రకృతి సంపదలను కొల్లగొట్టారని, అందుకే వారిని హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. తూర్పు కనుమలలో మైనింగ్‌ మాఫియాను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories