పోస్టర్ కింద బాంబులు

nanireddy
Updated on: 24 Dec 2018 3:45 PM IST
పోస్టర్ కింద బాంబులు
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోస్టర్ కింద బాంబులు కలకలం రేపాయి. వెంకటాపురం మండలం పాత్రపురంలో పలుచోట్ల ఎర్రటి టవల్ పై మావోయిస్టుల రాతలు కనిపించాయి. తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపిస్తూ దీనిపై రాశారు. దీన్ని చూసేందుకు వెళ్లిన స్థానికులు పోస్టర్ల కింద బాంబులు ఉండడం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్‌ సహాయంతో వాటిని నిర్వీర్యం చేశారు. గతంలోనూ ఇక్కడ ఇదే తరహాలో మావోయిస్టులు ప్లాన్ చేశారు. అప్పట్లో ఓ ఆటో డ్రైవర్ గాయాలపాలయ్యాడు.

nanireddy

nanireddy

Next Story