మావోయిస్టు అగ్రనేత జంపన్న లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత జంపన్న లొంగుబాటు
x
Highlights

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు జంపన్న ఆలియాస్ నరసింహారెడ్డి లొంగిపోయారు. మహబూబాబాద్‌ జిల్లా చర్లపాలెంకు చెందిన జంపన్న 35 ఏళ్ల పాటు...

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు జంపన్న ఆలియాస్ నరసింహారెడ్డి లొంగిపోయారు. మహబూబాబాద్‌ జిల్లా చర్లపాలెంకు చెందిన జంపన్న 35 ఏళ్ల పాటు మావోయిస్టుగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనతోపాటు మరో మహిళ జంపన్న భార్య అగ్రనేత రజిత కూడా లొంగిపోయారు. మావోయుస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో ఉన్న 14 మందిలో 10వ వ్యక్తిగా జంపన్న ఉన్నాడు. ఆయన తలపై రూ. 40 లక్షల రివార్డు ఉంది.

మహబూబాబాద్‌లోని తొర్రూర్ మం డలం చెర్లపాలెం గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి పాలిటెక్నిక్ చదువుతున్న వయస్సులో 1984 పీపుల్స్‌వార్ (పీడబ్ల్యూ) కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. అదే ఏడాది ఏటూరునాగారంలో నిర్వహించిన పీపుల్స్ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన అత డు... ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లా డు. తొలుత మహదేవ్‌పూర్ ఏరియా కమిటీలో పనిచేశాడు. అనతికాలంలోనే ఏటూరు నాగారం - మహదేవ్‌పూర్ కమిటీల కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు. సుమారు 25 ఏండ్ల కిందటే కేంద్ర కమిటీలో చేరి, ప్రస్తుతం మిలిటరీ విభాగం చీఫ్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. మావోయిస్టు అగ్రనాయకులకు సంబంధించిన భద్రత, శిక్షణ, కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దిట్ట అయిన జంపన్న.. కేంద్ర కమిటీలో కీలక భూమికను పోషించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories