మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక చిత్రం

మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక చిత్రం
x
Highlights

గీతాంజలి , 19 మే 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున,...

గీతాంజలి , 19 మే 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం మరియు మలయాళం భాషలలోకి కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. "యంగ్ డై ఫస్ట్" అనే అంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన దర్శకుడు మణిరత్నం అదే తరహాలో ఈ కథ రాసుకున్నాడు. కథానాయిక పేరు గీతాంజలి ఢిల్లీ కి చెందిన 11 సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 12అక్టోబర్,1988 నాడు చిత్రీకరణ మొదలయింది. చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి అయింది. గిరిజ యొక్క సహజ నటన, తమ పాత్ర మాటలు ఆ రోజుల్లో సూపర్ హిట్ అయ్యాయి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories