Top
logo

బుల్లెట్ ట్రయిన్‌ను తలపించిన పందుల గుంపు

X
Highlights

పందులే గుంపులుగా వస్తాయంటూ రజనీకాంత్ డైలాగ్ ఇక్కడ రివర్స్ అయ్యింది. బుల్లెట్ ట్రైన్‌ తరహాలో పరుగులు పెట్టిన...

పందులే గుంపులుగా వస్తాయంటూ రజనీకాంత్ డైలాగ్ ఇక్కడ రివర్స్ అయ్యింది. బుల్లెట్ ట్రైన్‌ తరహాలో పరుగులు పెట్టిన పందుల గుంపు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పరిధిలోని పోలాల మీదుగా వెళ్లిన అడవి పందుల గుంపు ఇది. జిల్లాలో ఇటీవల భారీ వరదలు రావడంతో అటవీ ప్రాంతాల్లోని అడవి పందులు పొలాల్లోకి వచ్చాయి. గుంపులు గుంపులుగా ఒక చోటు నుంచి మరో చోటుకు పరుగులు పెడుతున్నాయి.

రెండు రోజుల క్రితం రేండ్లగూడలోని లచ్చన్న పొలం దగ్గర పందులు పరిగెడుతుండగా స్ధానికులు వీడియోలో బంధించారు. వాట్సప్‌ ద్వారా ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. తొలుత బుల్లెట్‌ ట్రైన్‌ తరహాలో పరుగులు పెడుతున్న పందులను చూసి అవాక్కవుతున్నారు. మరో వైపు అటవీ పందుల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లవద్దంటూ చెబుతున్నారు.

Next Story