మేనేజ్మెంట్ స్కిల్స్ విద్యార్థి దశ నుంచే అలవర్చు కోవాలి - డా. శ్రీనుబాబు పల్సస్ సీఈఓ

మేనేజ్మెంట్ స్కిల్స్ విద్యార్థి దశ నుంచే అలవర్చు కోవాలి - డా. శ్రీనుబాబు పల్సస్ సీఈఓ
x
Highlights

ఆంధ్రా విశ్వకళాపరిషిత్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో కొంత మంది ప్రముఖలుని మరియు పల్సస్ అధినేత డాక్టర్ గేదెల శ్రీనుబాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ...

ఆంధ్రా విశ్వకళాపరిషిత్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో కొంత మంది ప్రముఖలుని మరియు పల్సస్ అధినేత డాక్టర్ గేదెల శ్రీనుబాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, మానవ వనరుల శాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు, వర్శిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరావు సత్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ విద్యార్థులు మేనేజ్మెంట్ స్కిల్స్ తన చదువుతున్నప్పటి నుంచే అలవర్చుకోవాలని మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే వాళ్లు ఏ రంగంలో ఉన్న ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని చెప్పారు మంచి జ్ఞానం ఉంటే శాస్త్రవేత్త అవుతారు పదిమంది శాస్త్రవేత్తల మేనేజ్ చేయగలిగితే సీఈవో అవుతారు అందుకు మంచి ఉదాహరణ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అని శ్రీనుబాబు తన ప్రసంగంలో చెప్పారు.

ఫార్మసీ నిపుణులకు భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ లో చదువుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మసి కాలేజ్ భారతదేశంలోని రెండవ కాలేజీ (Estd 1951) అని అంతటి ప్రాముఖ్యత ఉన్న కాలేజీ లో 2000 నుంచి 2004 బి.ఫార్మ్ చేసానని ఇక్కడ ఉన్న గురువుల ద్వారానే మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్నానని అదే ఈ రోజు 5 వేల మందికి ఉపాధి నిచ్చే పరిశ్రమ స్థాపనకు ఉపయోగపడిందని శ్రీనుబాబు చెప్పారు.

పాశ్చాత్య దేశాల్లో యూనివర్సిటీలు చాలా బలంగా ఉండడానికి కారణం వాళ్ల అల్యూమిని అని నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లో పోస్ట్ డాక్టరేట్ చేశానని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అల్యూమిని చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వలన అక్కడ సిలికాన్ వేలీ ఏర్పడిందని ఆ సిలికాన్ వేలీ వలననే గూగుల్, యాహు , సన్ మైక్రోసిస్టమ్స్ లాంటి పలు సంస్థలు ఏర్పడ్డాయి అలాంటి డెవలప్మెంట్ అల్యూమిని ద్వారా జరుగుతుందని ఈ సందర్భంగా శ్రీనుబాబు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories