దారుణం.. ముగ్గురు యువకులతో కలిసి భర్తను చంపిన భార్య

x
Highlights

హైదరాబాద్‌లో ఓ యువకుడు చేసిన ఆత్మహత్యాయత్నం మరో హత్య విషయాన్ని బయటపెట్టింది. లాలాపేటలో నరేష్ అనే యువకుడు గొంతు కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. హత్య...

హైదరాబాద్‌లో ఓ యువకుడు చేసిన ఆత్మహత్యాయత్నం మరో హత్య విషయాన్ని బయటపెట్టింది. లాలాపేటలో నరేష్ అనే యువకుడు గొంతు కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. హత్య కేసులో తనొక్కడినే ఇరికిస్తారనే భయంతో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు.

నరేష్ సూసైడ్ అటెంప్ట్ వెనుక దారుణమైన ఘటన దాగి ఉంది. గత నెల 30వ తేదిన మగ్గురు యువకులతో కలిసి ఓ భార్య భర్తను కడతేర్చింది. తర్వాత మగ్గురు యువకులు శవాన్ని తీసుకెళ్లి నల్గొండ చెరువులో పడేశారు. ఇప్పుడు ఆ మిగతా ముగ్గురు హత్య కేసులో నరేష్ ఒక్కడినే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. హత్య కేసు విషయాన్ని ఎక్కడ బయటపెడతాడోనని తనపై 10 మంది దాడి చేసినట్లు చెప్పాడు నరేష్. ప్రస్తుతం నరేష్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేష్ తో పాటు హత్య చేసిన ముగ్గురు ఎవరు.? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎందుకు హత్య చేశారన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories