రెచ్చిపోయిన ప్రేమోన్మాది...యువతి ఇంట్లోకి మంటలతో ...

x
Highlights

హైదరాబాద్..పాతబస్తీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ వివాహిత ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు...

హైదరాబాద్..పాతబస్తీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ వివాహిత ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో యువతి సహా మరో ఇద్దరు కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. పాతబస్తీలోని బార్కస్ లో నివసించే వివాహితుడు ఇబ్రహీంకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టప్పా చబుత్రాకు చెందిన యువతిని ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చినా వేధింపులు మానకపోవడంతో ఇబ్రహీంపై ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఇవాళ యువతి ఇంటికి వచ్చిన ఇబ్రహీం తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. యువతిని, ఆమె అన్నను, ఓ బంధువును మంటలతో పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇబ్రహీంతో పాటు యువతికి, ఆమె అన్నావదినలకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ముగ్గురిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories