విజయవాడలో దారుణం.. పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

విజయవాడలో దారుణం.. పెట్రోల్‌ పోసి నిప్పంటించారు
x
Highlights

విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. గగారిన్ కార్యాలయంలోనే ఈ ఘటన...

విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. గగారిన్ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో గవర్నర్ పేట బిగ్ బజార్ సమీపంలో దారుణం జరిగింది. బీసెంట్ రోడ్‌లో పట్టపగలు జనాలంతా చూస్తుండగానే గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ ప్రాణ భయంతో బాధితుడు రోడ్డుపైకి పరుగులు తీయగా పక్కనే షాపులో ఉన్న ఓ యువకుడు నీళ్లు తెచ్చి పోశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యాపారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గగారిన్ పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో గగారిన్‌ చికిత్స పొందుతున్నాడు. వెంటిలేటర్‌పై గగారిన్ కు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తేకానీ చెప్పలేమని డాక్టర్ రామారావు వెల్లడించారు. మాదాల సురేష్‌, మాదాల సుధాకర్ పెట్రోల్‌పోసి తనపై పెట్రోల్ పోసి తగుటబెట్టారని గగారిన్‌ పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. కోటి రూపాయల ఫైనాన్స్‌ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories